Bone Marrow Transplant

Categories

Bone Marrow Transplant

Dec 27, 2022

బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్! మోకాలిలో కీళ్లు అరిగిపోతే కొత్త కీలు పెట్టి రీప్లేస్ మెంట్ చేస్తున్నారు. తలపై జుట్టు ఊడిపోతే వెనక వైపు నుంచి జుట్టు తీసి నాట్లు వేసి ట్రాన్స్ ప్లాంట్ చేస్తున్నారు. అంతెందుకు కంట్లో కార్నియా దెబ్బతింటే కూడా కొత్త కార్నియా పెట్టేస్తున్నారు. అంతమాత్రమేనా కిడ్నీలు, లివర్లు, గుండె దాకా ఎన్నో ట్రాన్స్ ప్లాంట్స్ చేస్తున్న కాలమిది. వైద్య శాస్త్రంలో ఈ ట్రాన్స్ ప్లాంటేషన్లు కేవలం అవయవాల వరకే ఆగిపోలేదు. ఎంతో ప్రాణప్రదమైన రక్తంలో జబ్బులొస్తే రక్తాన్ని కొత్తగా ఉత్పత్తి చేసే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ దాకా విప్లవాత్మకంగా ముందడుగు వేసింది. నిజం చెప్పాలంటే పిల్లల్లో ఎన్నో ప్రాణాంతక క్యాన్సర్ల విషయంలో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ అనేది నేడు ఓ సంజీవని లాంటి వైద్యం అని చెప్పాలి.రక్తం… జీవ ఇంధనం. రక్తమే ప్రాణాధారం. రక్తంలో ఏ చిన్న సమస్య వచ్చినా అది మొత్తం శరీరంపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదముంది. సాధారణంగా రక్తంలో రెండు రకాల సమస్యలు చూస్తుంటాం. ఇవి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. క్యాన్సర్‌ కాని బ్లడ్‌ డిజార్డర్లు పుట్టుకతో రావొచ్చు. పుట్టిన తరువాత కొన్నేళ్లకు కూడా రావొచ్చు. పుట్టుకతో వచ్చే వ్యాధులు వంశపారంపర్య కారణాల వల్ల వస్తాయి. థాలసీమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా, ఇమ్యునో డెఫీషియన్సీ వ్యాధులు పుట్టుకతో వచ్చేవే. అయితే రక్తకణాల వ్యాధుల నుంచి క్యాన్సర్ల దాకా రక్తకణ సంబంధ సమస్యలకు బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చక్కటి పరిష్కారంగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.రక్తంలో ముఖ్యంగా లుకీమియా, లింఫోమా అనే క్యాన్సర్లు వస్తుంటాయి. లుకీమియా రెండు రకాలు. ఒకటి.. అక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకీమియా. పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. ఈ క్యాన్సర్ కీమో వల్ల 90 శాతం, ఆ తరువాత పది శాతం బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ వల్ల తగ్గుతుంది. రెండోది… అక్యూట్‌ మైలాయిడ్‌ ల్యుకేమియా. ఈ క్యాన్సర్ ఉన్న 50 శాతం పిల్లలకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం పడుతుంది. హైరిస్క్ లుకీమియాలకు బిఎంటి చేసేటప్పుడు ముందు హై డోస్‌ కీమోథెరపీ ద్వారా బోన్‌మ్యారోని నియంత్రణ చేసి, తరువాత స్టెమ్‌ సెల్స్‌ ఎక్కిస్తారు. ఇవి ఆరోగ్యకరమైన రక్తాన్ని తయారుచేస్తాయి. ఈ రక్తం రెండు మూడు వారాల్లో తయారవుతుంది. ఈ ప్రక్రియ కోసం స్పెషల్ బీఎంటీ యూనిట్లలో పెట్టి, పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించినట్టుగానే మూలకణాలను కూడా ఎక్కిస్తారు. ఆటోలోగస్‌ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ లో – పేషెంట్‌ బోన్‌ మ్యారోనే వాడుతారు. ఇది మైలోమా, లింఫోమాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మూలకణాలను సేకరించి వాటిని ఫ్రీజ్‌ చేస్తారు. తరువాత హై డోస్‌ కీమోథెరపి ఇచ్చి, అప్పటివరకు ఫ్రీజ్‌ చేసి వుంచిన మూలకణాలను ఎక్కిస్తారు. అలోజెనిక్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ – డోనర్‌ నుంచి మూలకణాలను తీసుకుంటారు. ఫుల్‌ మ్యాచ్‌ లేదా హాఫ్‌ మ్యాచ్‌ లేదా అన్-రిలేటెడ్ డోనర్‌ నుంచి తీసుకుని ఎక్కిస్తారు. దీనివల్ల సమస్య మళ్లీ రాకుండా ఉంటుంది.బోన్ మ్యార్ ట్రాన్స్ ప్లాంట్ చేశాక… ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడాలి. రోగనిరోధక శక్తి సాధారణ స్థితికి రావడానికి ఏడాది పడుతుంది. ఈ సమయంలో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్లే తాగాలి. ఈ సమయంలో మందులు కరెక్టుగా వేసుకోవాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. సంవత్సరం పాటు పీరియాడిక్ చెకప్ కు వెళుతూ ఉండాలి.బోన్ మ్యార్ ట్రాన్స్ ప్లాంటేషన్లో కొన్ని రకాల అపోహలు వినిపిస్తుంటాయి. కిడ్నీ, లివర్‌ లాగా బోన్‌ మ్యారో అంటే ఎముక తీసుకుంటారని భయపడుతారు. కాని కేవలం మూలకణాలను మాత్రమే రక్తం నుంచి తీసుకుంటారు. మిగిలిన కణాలు తిరిగి డోనర్‌కే వెళ్లిపోతాయి. మెషిన్‌ కేవలం మూలకణాలను మాత్రమే సేకరిస్తుంది. ఈ మూల కణాలు కూడా కొన్ని రోజుల్లోనే దాతల్లో మళ్లీ తయారవుతాయి. ఎటువంటి ఇబ్బందులూ రావు. ఇచ్చిన వాళ్లు నార్మల్‌గానే ఉంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ కి రక్తం గ్రూప్‌ మ్యాచ్‌ కావాలనుకుంటారు. నిజానికి అవసరం లేదు. హెచ్‌ఎల్‌ఎ జన్యువు మ్యాచ్‌ కావాలి. ఫుల్ మ్యాచ్ బెస్ట్ మ్యాచ్. అది దొరకని పక్షంలో హాఫ్‌ మ్యాచ్‌ కి కూడా వెళతారు. ఫుల్ మ్యాచ్ అయితే కాంప్లికేషన్లు తక్కువ. ఖర్చు కూడా తక్కువ. ఇక బోన్ మ్యార్ ట్రాన్స్ ప్లాంట్ అనేది సర్జరీ కాదు. మూలకణాలను ఎక్కడి నుంచి ఎక్కించినా బోన్‌మ్యారోకే వెళ్తాయి. ఎముక కోసి, దానిలోపలికి పంపిస్తారని పొరపడుతుంటారు. రక్తం ఎక్కించినట్టుగా మూలకణాలను కూడా ఎక్కిస్తారు. అంతే. ట్రాన్స్‌ఫ్యూజ్‌ చేశాక ఆ కణాలు బోన్‌మ్యారోకు చేరుకుంటాయి. జబ్బుతో ఎలాగూ ఎక్కువ రోజులు బతకరు. అలాంటప్పుడు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ లాంటి ఖరీదైన చికిత్సలెందుకు అనుకుంటారు. కానీ బ్లడ్‌ క్యాన్సర్లు, ఇతర బ్లడ్‌ వ్యాధులకు ఇది మాత్రమే చికిత్స. దీని సక్సెస్‌ రేటు 90 శాతానికి పైగా పైగా ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ తర్వాత పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, క్యాన్సర్ వైద్యులతో పాటు నిపుణులైన పీడియాట్రిక్ వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లాంటి చోట్ల వైద్యం తీసుకోవడం మంచిది.

Dr. Sirisha Rani

Pediatric Hematologist & Oncologist

Rainbow Children's Hospital - Banjara Hills

Home Best Children Hospital Child Care Best Children Hospital Women Care Best Children Hospital Fertility Best Children Hospital Find Doctor